ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి ఏప్రిల్ 2.3.24 :
యాదాద్రి భువనగిరి జిల్లాలోనియాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలోని కైలాసపురం శ్రీ రేణుక బసవలింగేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటుగా వివిధ పుణ్యక్షేత్రాల జిల్లాలతో అభిషేకం మరియు అన్నపుజా కార్యక్రమం నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి . అనంతరం ఆధ్యాత్మిక చింతనకై 7 రోజులపాటు 14 ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు దర్శించుకుని తీసుకువచ్చిన ప్రసాదాన్ని డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి భక్తులకు అందజేశారు . రేణుక ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రశాంతి శ్రీధర్ దంపతులు అమ్మవారికి సారే చేరే సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం రాజపేట మండల అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్త,హెచ్ఎంటీవీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి గుండు మహేందర్ హజరయ్యారు.ప్రసాద పంపిణీ అనంతరం వచ్చిన అతిథులను సత్కరించి ఆశీర్వచనం అందచేసారు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి . ఈ సందర్భంగా డాక్టర్ వంగపల్లి స్వామి మాట్లాడుతూ ప్రముఖ బీసీ సంఘం నాయకుడు పంజాల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో 14 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రసాద పంపిణీ జరగడం శుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ ఎన్ ఛానల్ సీఎండి సామ శ్రీధర్ దంపతులు, నేను సైతం రండి సమాజానికి సేవ చేద్దాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బీసీ సంఘం నాయకుడు పంజాల వెంకన్న గౌడ్ , రిపోర్టర్లు మల్లిగాడు శ్రీనివాస్ దంపతులు, ప్రొద్దుటూరు రమేష్,జైన శ్రీనివాస్ దంపతులు,సిద్ది శ్రీనివాస్,పల్లెర్ల సంతు,ప్రభాకర్, ఆలేరు వాసవి క్లబ్ అధ్యక్షులు సముద్రాల రవి, ఆర్యవైశ్య నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.















