EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రేణుక ఎల్లమ్మ దేవాలయం దర్శించుకున్న టిపిసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత

 

 

యాదాద్రి భువనగిరి, జనవరి 19(eetaram bharatam news)యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం కాచారం ( కైలాస పురం) లోని శ్రీ వాసవి రేణుకా, బసవ లింగేశ్వర దేవాలయాలను ఆర్యవైశ్య నాయకురాలు టి పిసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ సుజాత మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిత్య పూజలు నిర్వహిస్తన్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆర్యవైశ్యుడిగా ఉండడం చాలా ఆనందదాయకమని సాధారణంగా వైశ్యులకు భక్తి సేవా భావాలు చాలా ఎక్కువగా ఉంటాయని కానీ పూజా కైంకర్యాలు నిర్వహించేవారు అతి కొద్ది మాత్రమే ఉంటారని వారిలో అంజయ్య స్వామి ఒకరుగా ఉండడం వైశ్య జాతి గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. రహదారి కూడా సరిగా లేని కారడవిలో ఉన్న ఈ దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి తమ తమ కోరికలు చెప్పుకొని వెళ్లడం అమ్మవారి శక్తికి నిదర్శనం అన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించిన పిదప తమ తమ కోరికలు నెరవేరుతాయి అని ప్రస్తుత ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య కూడా గతంలో అమ్మవారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారని తెలిసి దేవాలయాన్ని సందర్శించానని అమ్మవారి కృపా కటాక్షాల వల్ల నా కోరిక కూడా నెరవేరుతుందని కోరిక నెరవేరిన వెంటనే మళ్లీ దేవాలయాన్ని సందర్శించి శ్రీ రేణుక ఎల్లమ్మ వాసవి అమ్మవారికి తమ మొక్కలు చెల్లించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top