రేషన్ బియ్యం అక్రమ “దందా” చేసే అక్రమార్కుల పై పి డి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయం అని.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.శనివారం నాడు ఆయన ఆమన్ గల్ లో రైస్ మిల్లులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొన్ని రైస్ మిల్లులు రేషన్ బియ్యం కు రుచి మరిగాయన్న సమాచారం ఉందన్నారు. వడ్ల మాటున రేషన్ బియ్యం బస్తాలను దాచి,ఆ తర్వాత వాటిని నూకలుగా మార్చే దందా ను గుట్టుగా చేస్తున్నాయన్న విశ్వాస నీయ సమాచారం ఉందన్నారు. అలా రేషన్ తో దందా చేసే మిల్లులకు తాళం పడటం ఖాయం అని స్పష్టం చేశారు.ఎవరెవరు , ఏయే మిల్లులకు రేషన్ బియ్యం చేరవేస్తారో..వారిని త్వరలో నే పట్టుకోవడం తధ్యం అని చెప్పారు.రేషన్ బియ్యం తో దందా వల్ల అనవసరం గా యువత భవిత ఆగమ్య గోచరం అవుతోందని చెప్పారు.
















