EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రైతుబంధు నిధులను నిష్ప్రయోజనం కానివ్వకండి.. లబ్దిదారుల పునః సమీక్ష తర్వాతే నిధులను విడుదల చేయాలి.. ముఖ్యమంత్రి కి బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ విజ్ఞప్తి

హైదరాబాద్ డిసెంబర్ 12 (ఈతరం ఇండియా న్యూ స్);రైతు బంధు నిధులను లబ్దిదారుల పునః సమీక్ష తర్వాతే విడుదల చేసి ప్రజాధనాన్ని నిష్ప్రయోజనం కాకుండా కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ విజ్ఞప్తి చేశారు..గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లొసుగుల పథకాల పట్ల ఆగ్రహంతోనే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని, రైతుబంధును యధావిధిగా కాకుండా చిన్న, సన్న కారు రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాగుచేయని బీడు భూములకు , గుట్టలకు, పుట్టలకు, భూస్వాములకు లబ్ధి చేకూర్చేలా రూపొందించిన రైతుబంధు అమలు విధానాలను ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూములకు పరిమితం చేయాలని సూచించారు. సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్న భూములకు రైతుబంధు నిలిపివేయాలని దాసు సురేష్ కోరారు.పంట పెట్టుబడి సాయం అర్హులైన రైతులకు దక్కితేనే రాష్ట్రములో వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో బాటు నిజమైన రైతు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుందనీ . అప్పుడే రైతుబంధు అసలు ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొన్నారు. రైతుబంధును ఐదు ఎకరాల లోపు పరిమితం చేస్తే కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సాయం అవలీలగా అదనపు నిధుల అవసరం లేకుండా సులువుగా అమలు చేసే అవకాశం ఉంటుందని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top