EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ల్యాండ్స్ ఆండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఓర‌గంటి రాముకు ఆత్మీయ స‌త్కారం 

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మార్చ్ 29,2024 :  హైద్రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లోని తెలంగాణ ప్ర‌భుత్వ ల్యాండ్స్ ఆండ్ రికార్డ్స్ సెంట్ర‌ల్ స‌ర్వే కార్యాల‌యంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓర‌గంటి రాముకు శుక్ర‌వారం సాయంత్రం కుటుంబ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఆత్మీయాభినంద‌న స‌త్కార కార్య‌క్ర‌మం చింత‌ల్ లోని ప‌ద్మాన‌గ‌ర్ ఫేజ్ – టూ కాల‌నీలో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించి స్వ‌శ‌క్తితో ప్ర‌భుత్వ ల్యాండ్స్ ఆండ్ రికార్డ్స్ శాఖ‌లో డిప్యూటి స‌ర్వేయ‌ర్‌గా ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ప‌దోన్న‌తులు పొందుతూ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హోదాలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి మూడు ద‌శాబ్దాల ఉద్యోగ ప్ర‌యాణాన్ని అంద‌రి ప్ర‌శంస‌ల‌తో దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వారి కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు. ఓర‌గంటి రాము వియ్యంకుడు ముత్యాల శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో రాము జీవిత విశేషాల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన స‌న్మాన ప‌త్రాన్ని బ‌హూక‌రించి పూల‌మాల‌లు, శాలువాల‌తో స‌త్క‌రించారు. కుటుంబ స‌భ్యుల ఆత్మీయ వేడుక‌గా రాము స‌త్కారం ఆనందోత్సాహాల‌తో సాగింది. త‌న ఉద్యోగ విర‌మ‌ణ సంద‌ర్భంగా ఎంతో ఆత్మీయంగా, అత్యంత ఘ‌నంగా స‌త్క‌రించి ప్రేమాభిమానాల‌ను చాటి చెప్పిన కుటుంబ స‌భ్యుల‌కు రాముతో పాటు ఆయ‌న స‌తీమ‌ణి స‌త్య‌ల‌క్ష్మి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కుటుంబ స‌భ్యులు సురేశ్ ఓర‌గంటి – స్ర‌వంతి, మ‌హేశ్ ఓర‌గంటి, రాకేశ్ ఓర‌గంటి – మ‌న‌స్విని, ముత్యాల శ్రీ‌నివాస్ – క‌మ‌ల‌, శ‌ర‌త్‌చంద్ర‌, నంద్యాల రాము – క‌ళావ‌తి, వినోద్, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top