EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వందరోజుల కాంగ్రెస్ ప్రజా పాలన తెలంగాణ ప్రజల ఆద ర అభిమానాలు చురగొన్నది : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

31.3.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, నలుబోల మధుశ్రీ.హైదరాబాద్

వందరోజుల కాంగ్రెస్ ప్రజా పాలన తెలంగాణ ప్రజల ఆధార అభిమానాలు చురగొన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్  ఆధ్వర్యంలో ఆదివారం కర్మన్ఘాట్ లోని కొత్త కాపు యాదవ రెడ్డి గార్డెన్స్ లో జరిగినది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి , రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రామ్ రెడ్డి రాంరెడ్డి, టిపిసిసి ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  మాట్లాడుతూ.. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా రేవంత్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించినట్లుగానే ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ని కూడా గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో తుక్కుగూడలో నిర్వహించిన సోనియా గాంధీ సభతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అదే తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి మోడల్ దేశమంతటికి ఆదర్శం గా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా అమలు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయన్నారు. వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన నీతి నియమాలతో ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి లో సమావేశాలు నిర్వహించాలన్నారు. సమన్వయం లోపాలు లేకుండా కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి పార్టీ అభ్యర్థి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా పార్లమెంట్ పరిధిలో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధి జరుతుందన్నారు. మూసీని ప్రక్షాళన, సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ను సుసంపన్న రాష్ట్రం గా తీర్చదిద్దెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మధుయాస్కి  మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ దుర్మార్గ పాలన.. వంద రోజుల ప్రజాపాలన తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్తుందన్నారు. ఎల్. బి. నగర్ నియోజకవర్గం లో ప్రజా సమస్య లను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన ఆస్తులు, చేసిన కబ్జాలను కాపాడుకోవటం కోసం మళ్ళీ కాంగ్రెస్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ఆయన్ను కాంగ్రెస్ లోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. మల్కాజిగిరి లో ఎంపీగా గెలిపించి ప్రజలు ఇచ్చిన ఆత్మస్థైర్యం తో రేవంత్ రెడ్డి సీఎం వరకు ఎదిగారని పేర్కొన్నారు. కార్యకర్తలు అంతా పట్టుదలతో పని చేసి పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని పేర్కొన్నారు. అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గం లోని ప్రజా సమస్య లు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో ప్రధానంగా వరద నీటి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వాటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అమలు జరిగే విధంగా కృషి చేస్తానన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూపాయలు 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఇల్లు లేని వారికి కూడా త్వరలో ఇందిరమ్మ ఇల్లు రానున్నాయని పేర్కొన్నారు . తమ కుటుంబం సేవలు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అంతా ఉన్నాయన్నారు. పట్నం మహేందర్ రెడ్డి రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసే ఎల్బీనగర్ నియోజకవర్గం తన సేవలందించారనిపేర్కొన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మల్రెడ్డి రాంరెడ్డి, చల్లా నరసింహారెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు లింగాల నాగేశ్వరరావు  మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారు , మధు యాస్కి గౌడ్  సమక్షంలో సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్, మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, టిపిసిసి ప్రతినిధులు గజ్జి భాస్కర్ యాదవ్, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి,కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్ , సామ రమణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఈశ్వరమ్మ యాదవ్, మల్లారపు శాలిని, ప్రేమ్నాథ్ గౌడ్, ఉమా శ్రీనివాస్, నాయకులు జిట్టా సురేందర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు కుట్ల నరసింహ యాదవ్, లింగాల కిషోర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సదాశివుడు, బుడ్డ సత్యనారాయణ, వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మల్లారపు శ్రీనివాస్, మంజుల తదితర నాయకులు హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top