EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వందే ప్రజ, బెత్లెహాం పారా మెడికల్ కాలేజీ ఆధ్వర్యం లో గణ తంత్ర దినోత్సవం

హైదరాబాద్ జనవరి 26(EB news) గణ తంత్ర  దినోత్సవ సందర్భంగా నిత్య జనగణమన కేంద్రం వద్ద విద్యార్థులు, యువత సందడి నెలకొన్నది. నిత్య జనగణమన నిర్వాహక సంస్థ వందే ప్రజ, నల్లకుంటలోని బెత్లెహేము పారామెడికల్ అండ్ ఒకేషనల్ కాలేజీ ఆధ్వర్యంలో ఇక్కడ గణతంత్ర దినోత్సవం విశిష్టంగా జరిగింది. 150 మందికి పైగా బెత్లెహేము కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు జెండా కేంద్రం నుంచి బర్కత్పురా చౌరస్తా మీదుగా జెండా కేంద్రం దాకా పతాక ర్యాలీని నిర్వహించారు. జాతీయ జెండాలను పట్టుకుని తెల్లటి ఆఫ్రాన్ ధరించిన విద్యార్థులు కదం తొక్కుతూ.. దేశభక్తియుత నినాదాలు చేస్తూ ప్రదర్శనగా సాగడం చూపరులను ఆకర్షించింది. కొందరు బాటసారులు కూడా వీరితో కలిసి నడవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీ అనంతరం కళాశాల చైర్మన్ ప్రసన్న కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతమంది కలిపి జాతీయ గీతాన్ని ఆలపించిన దృశ్యం కన్నుల పండుగగా.. వీనుల విందుగా.. మనసుకు ఆహ్లాదంగా ఉంది. జాతీయ గీతాలాపన తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ శ్రీనివాస్ సర్, ప్రశాంతి మేడం, విద్యార్థులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ చాక్లెట్లను అందజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ సంబరాలను కొనసాగించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నేలంటి మధు, వందే ప్రజా శ్రీనివాస్, బీట్కూరి గోపి కృష్ణమాచార్యులు, ఉపేంద్ర ప్రసాద్ దుబే, పురం వెంకటేశం గుప్తా, పురం కృష్ణ గుప్తా విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు. మార్గంలో వెళుతున్న బాటసారులు, వాహనదారులు ఆగిపోయి కార్యక్రమాన్ని తిలకించడం విశేషం.

Related News

Select the Topic
Scroll to Top