హైదరాబాద్ జనవరి 22 (eetaram bharatam news);వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 8 స్థానాలకు తగ్గకుండా కేటాయించాలని బీసీ సేన జాతీయఅధ్యక్షులు బర్కకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.విద్యా నగర్ లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీసీలకు ముప్పై నాలుగు అసెంబ్లీస్థానాలు కేటాయిస్తామని 22 స్థానాలకు పరిమితం చేసి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతోపాటు అధికారంలో లేనప్పుడు బీసీ నాయకులతో ఊడిగం చేయించుకునే రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో పార్టీలోకి వలస వచ్చిన తమ సొంత సామాజికవర్గ నాయకులకు టికెట్లు కేటాయించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్చించారు. ఉదాహరణకు 2014,2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన బిసి సామాజిక వర్గానికి చెందిన బండారి శాంతి కుమార్ కు బిజెపి పార్టీ తీరని అన్యాయం చేసిందని ఈ సారైనా పార్లమెంటు సీట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మరోసారి బీసీలనుఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకోవాలని చూస్తే బీసీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీలకు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కేటాయించిన కేటాయించినవారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈసమావేశం లో లో బీసీసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరాటే ఎత్తినే చెన్నయ్య, వెంకటేష్ యాదవ్, సెలేటి వెంకటేష్ ముదిరాజ్, బాలస్వామి, గొడుగు నర్సిములు, రమేష్, చందు, సందీప్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.















