నల్లగొండ ఫిబ్రవరి 6(ఈ బీ న్యూస్) తెలంగాణ సాహిత్యానికి సాహిత్య చరిత్రకు సాహిత్యకారుల కు దక్కవలసిన న్యాయమైన స్థానం నేడు దక్కకుండా పోతుందని ఇందుకు నిదర్శనమే వట్టికోట శతజయంతి ఉత్సాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పున్న అంజయ్య అన్నారు. వట్టికోట ఆళ్వారు స్వామి 63వ వర్ధంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వట్టికోట విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం2015నవంబర్ 1వ తేదీన వట్టికోట శతజయంతి ఉత్సవాలను నిర్వహించకుండా విస్మరించిందని వట్టికోట తెలంగాణ గట్టికోట అని ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని విమర్శించారు ఇప్పటికైనా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు నల్లగొండ మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సహచర మంత్రివర్గం పునరాలోచన చేసి వట్టికోట శతజయంతి ఉత్సవాలను వచ్చే నవంబర్లో ఘనంగా జరిగేటట్లు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.















