EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వడ్డేపల్లి కి కృష్ణారావు స్మారక జీవన సాఫల్య పురస్కారం

రచయితల ప్రతిభకు పట్టం కట్టినప్పుడే స్ఫూర్తిదాయకమైన రచనలు వెలుపడతాయని ఆచార్య నర్సిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్, చిరునవ్వు సంస్థల ఆధ్వర్యంలో ధార్మిక కవి కీర్తిశేషులు ఉమ్మడి సింగు కృష్ణారావు 94వ జయంతి కార్యక్రమం చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభ లోని లలిత కళావేదికలో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు డాక్టర్ నిష్టల గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రసిద్ధ కవి పండితులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసిద్ధ కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణకు కృష్ణారావు స్మారక జీవన సాఫల్య పురస్కారం చేసి రూ. 5,116 ప్రదానం చేసి సత్కరించారు. ఇదే సభలో బాలమేధావి చిరంజీవికి రూ.25,116 లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం లో సత్కారం పొందిన బండారుపల్లి రామచంద్రారావు, దైవదశర్మ, డాక్టర్ రాధా కుసుమ, వి.విశ్వనాథ్, శ్రీనివాస్ లను ప్రసంగించారు. సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో కవులు నాన్న అనే అంశంపై కవితలు వినిపించి సత్కారాన్ని అందుకున్నారు .కోకా భవాని ,   బండారు   పల్లి   రామ చంద్ర  రావు లు.  సమన్వయం చేసారు.


 

Related News

Select the Topic
Scroll to Top