EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వధూవరుల ఎంపిక అగ్రగామి “ఆదర్శ” మ్యాట్రిమోని

హైదరాబాద్ ఏప్రిల్ 13 (ఈతరం భారతం న్యూ స్);మనకు నచ్చిన వధూవరులను ఎంపిక చేసి వివాహ సంబంధాలను కుదర్చడంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల ఆదర్శ మ్యాట్రిమోని అగ్రగామి సంస్థగా నిలిచింది. దీని వెనుక ఒక వ్యక్తి కృషి వుంది. అతనే వంగాల బాలరాజ్ గౌడ్. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలలో పని చేసిన వంగాల “ఆదర్శవాణి” “ఆదర్శ కిరణం” అనే బి.సి. పత్రికలను గత 15 సంవత్సరాలుగా నిరాటంకంగా నడుపుతున్నారు. ఆదర్శ మ్యాట్రిమోనిని 1993లో హిమాయత్నగర్ వీధి నెం. 8లో గల గౌడ హాస్టల్ ప్రాంగణంలో ప్రారంభించి, గత 31 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నడిపిస్తూ ఇప్పటివరకు 1700 జంటలను ఏకం చేసి వివాహాలు జరిపించారు. గౌడ కులానికే కాకుండా బి.సి. కులాలు, కులాంతర వివాహాలు అత్యధికంగా సెటిల్ చేస్తూ ముఖ్యంగా స్వదేశీ పెళ్ళి సంబంధాలే కాకుండా ముఖ్యంగా యు.ఎస్.ఏ., కెనడా, యూరప్, ఆస్ట్రేలియా మరియు ఇతర విదేశీ పెళ్ళి సంబంధాలు, అన్ని రకముల వీసా హోల్డర్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, మరియు పర్మనెంట్ రెసిడెన్స్, సిటిజన్స్ సంబంధాలు ఈ మధ్యన ఎక్కువగా సెటిల్ చేస్తూ పేరు సంపాదిస్తున్నారు. విదేశీ పెళ్ళి సంబంధాలు, కులాంతర వివాహాలు సెటిల్ చేయటంలో నేడు మార్కెట్లోగల మ్యాట్రిమోని బ్యూరోలలో వీరిదే పైచేయి. అనుభవజ్ఞులైన మహిళా మేనేజర్స్ కూడా వీరి బ్యూరోలో కలరు.బేగంపేటలోని టూరిజం ప్లాజాలో కూడా నూతన కార్యాలయాన్ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ మ్యారేజీ బ్యూరోల సంఘానికి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆదర్శ మ్యాట్రిమోనిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేయడానికి కృషి చేస్తున్నారు. పేదలకు సామూహిక వివాహాలు 6 నెలలకొకసారి దాతల సౌజన్యంతో జరిపించడానికి కూడ కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలకు 9989951626, 7032298989 వాట్సాప్ నెంబర్లలో “ఆదర్శ మ్యాట్రిమోనిని’ సంప్రదించవచ్చు

.

 

Related News

Select the Topic
Scroll to Top