వరద ఉధృతి కి తెగి పోయిన రెండు రాష్ట్రాల వారధి తక్కెళ్ళ పాడు బ్రిడ్జి
02.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న తక్కెళ్ళపాడు బ్రిడ్జి రాత్రి పైనించి వచ్చిన వరద ఉధృతికి తెగిపోయినది.రెండు రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయినవి. ప్రజలు గమనించండి అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయలుదేరండి విజయవాడ నుండి హైదరాబాదు వరకు అనేక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడెక్కడనే వాహనాలు ఆపుతున్నారు. నందిగామ, కొంగరమల్లయ్య గట్టు వద్ద టోల్ ప్లాజా, రామాపురం అడ్డరోడ్డు వద్ద సూర్యాపేట వద్ద వాహనాలు వెళ్లకుండా ఎక్కడ ఎక్కడకి అధికారులు, పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలు బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దు అని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ మానవ హక్కుల సంగం ప్రతినిధులు రీజినల్ చైర్మన్ వల్లాపురపు వెంకట బాబు కోరుతున్నారు.















