హైదరాబాద్ మే 16 (ఈతరం భారతం న్యూ స్);వరి ధాన్యం విషయంలో బిఅర్ఎస్ నాయకులు ధర్నాలు సిగ్గు చేటని ఎమ్మెల్సీమహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గురువారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు.. ఏం వెలగబెట్టారు. బిఅర్ఎస్ నేతలు రైతులకు జ్ఞాపక శక్తి లేదని అనుకుంటున్నారు.కేసిఆర్ ప్రభుత్వంలో రైతుల తో ఎలా ప్రవర్తించారో చూశాం ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకువెళ్ళలేదా అని ప్రశ్నించారు.నేరెళ్ళ రైతులు కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫియా అడ్డుకుంటే దాడులు చేశారు.పంట నష్టపోతే రైతులను పరామర్శించలేదు.మేము ధర్నా చేస్తే రైతులు ఆదరిస్తారు అని అనుకుంటున్నారు వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్.. ఆయన ఫాం హౌస్ లో వరి వేసుకోలేదా..?రైతులకు పదేళ్లలో బాసటగా నిలువలేదన్నారు.ఎన్నికల సమయంలో తాయిలాలు ఇవ్వడం పది రెట్లు రైతులను ముంచడం చేశాడు.గత ప్రభుత్వం కన్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి లోనే ఐకేపీ సెంటర్లు తెరుచామన్నారు.గత ప్రభుత్వం కన్న ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తుంది ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు.ప్రజలు ఈ నాలుగు నెలల పాలన లో సంతోషంగా ఉన్నారు.సిగ్గు లాజ్జ లేకుండా ధర్నాలు చేస్తున్నారు.రైతులకు రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు అందజేస్తారు.ఆచరణకు సాధ్యం కానీ హామీలు కాంగ్రెస్ ఇవ్వదు కేసిఆర్ అప్పులతో..చిప్ప చేతికి ఇచ్చి వెళ్లిన ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు..పార్లమెంట్ ఎన్నికల్లో తుడుచుకు వెళ్తున్నారు కాబట్టి ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.కల్లల వద్ద పడిగాపులు కాచి ప్రాణాలు వదిలిన రైతులు ఎంతమందో.. కానీ కేసిఆర్ పట్టించుకోలేదు.దేశంలోనే తెలంగాణ కేసిఆర్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానం లో ఉంది.కేసిఆర్ జిమ్మిక్కులు నమ్మకండి.పదేళ్లలో బీజేపీ ప్రజలకు ఏం చేసిందో బీజేపీ నాయకులు ఆలోచించాలన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదలకు మేము జరుగుతుంది అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కి వస్తున్నాయి.. ఎటువంటి సంశయం లేదు.ధర్నాలు చేసేది రైతులు కాదు.. BRS నేతలుసీఎం రేవంత్ రెడ్డి చేయని వాక్యాలను అన్నట్లుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో 6 నుంచి పది కిలోల తరుగు తీశారు.మిల్లర్లకు లబ్ధి చేకూర్చి కమిషన్లు తిన్నారు.పీసీసీ చీఫ్ పదవి అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంది.నేను సీనియర్ కార్యకర్తను.. నేను ప్రయత్నాలు చేస్తున్నాను.ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు అధిష్టానం పీసీసీ పదవి కట్టబెడుతుంది.నాకన్నా ఎక్కువ అర్హతలు ఎవరికైనా ఉంటే వారికే ఇస్తుంది.















