EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వసంత కవితా సంకలనం ఆవిష్కరణ

హైదరాబాద్ ఈబీ న్యూస్ ప్రతినిధి, ఫిబ్రవరి 16,2024 :కరీంనగర్ కు చెందిన కవయిత్రి,, ఉపాధ్యాయిని పత్తెం వసంత రచించిన ఆకాశమే అవధిగా కవితా సంపుటి ఆవిష్కరణను శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రఖ్యాత రచయిత  ,  రాజకీయ  విశ్లేషకులు,  జర్నలిస్టు నేలంటి మధు,   కేంద్ర  సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ లు సంపుటిని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ కవి ఆశారాజు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అనేక రచనలు చేసిన వసంత తాను వెలువరించిన ఆకుపచ్చని ఆశ, ఆలోచనల రెక్కలు, ఆకాశమే అవధిగా సంపుటి లతో ప్రత్యేక గుర్తింపును పొందారని ప్రశంసించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతున్న విశిష్ట సందర్భంలో వసంత తన నూతన సంపుటిని ఆవిష్కరించినందుకు వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బోగా నాగభూషణం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top