ఎర్ర రక్త కణాల (RBC) సగటు జీవిత కాలము 110 మొదలు 112 రోజులు అని ఈ కాల వ్యవధి అనంతరం అవి శరీరంలో నశించిపోతాయి అని వాటి స్థానములో కొత్తవి చేరతాయి అని ఈ క్రమ విధానములో ప్రతి మానవునిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు. కాబట్టి మీరు రక్త దానము చేయకపోయినా ఎర్ర రక్త కణాలు నశించిపోతాయి కాబట్టి రక్తదానం చేయడమే మంచిది. మన శరీరంలో సహజంగా నశించిపోయేలా చేయటం కంటే నాలుగు నెలలకొకసారి రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు. నేడు వికారాబాద్ రక్త నిధి కేంద్రంలో మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తము అవసరం ఏర్పడుతుందని, సరైన సమయంలో రక్తం అందకపోవటం వల్ల ఏటా మనదేశంలో 12,000 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు. క్యాన్సర్, సికిల్ సెల్, అనీమియా పీడితులు, గర్భిణీలు, ప్రమాద బాధితులు శాస్త్ర చికిత్స చేయించుకున్న వారికి అత్యవసర పరిస్థితులలో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, 2021 లెక్కల ప్రకారం ఏడాదికి మనదేశంలో 1.5 కోట్ల యూనిట్ల రక్తం అవసరము అవుతుండగా ఒక కోటి పది లక్షల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, మన దేశంలో జరుగుతున్న రక్తదానాలలో 84% దాకా స్వచ్ఛంద దాతలు నుంచే సేకరిస్తున్నారని రక్తదానముపై అవగాహన పెంచేందుకు ఎన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పలు రకాల అపోహల కారణంగా ప్రతి 30 మందిలో ఒకరు మాత్రమే స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు.