EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వికారాబాద్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం  మంటల్లో చిక్కకున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితం

వికారాబాద్ మే 17 (ఈతరం భారతం న్యూ స్);వికారాబాద్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలో రామయ్యగూడ రోడ్డులో ఉన్న ఓ హార్డ్ వేర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పక్క భవనానికి వ్యాపించాయి.ఈ ప్రమాదంతో పరిసర ప్రాంతంలో భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కకున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో హార్డ్ వేర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top