విజయవాడ/ఖమ్మం సెప్టెంబర్ 24 (ఈతరం భారతం);విశ్వకర్మ ఆంధ్ర, తెలంగాణ సేవా సంస్థల సమాఖ్య (వత్స) ఆధ్వర్యంలో వరద బాధితులకు నగదు, దుస్తులు, నిత్యావసర వస్తువులు, హోమియో మందు పంపిణి చేసారు. చిట్టి నగర్ లోని పుల్లేటికుర్తి వారి కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం పంపిణి కార్యక్రమాన్ని టిడిపి అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. 250 మంది వరద బాధితులలోని విశ్వబ్రాహ్మణులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుకుగా సామాజిక సేవలు అందచేస్తున్న వెస్సొ ట్రస్ట్, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్, విశ్వకర్మ ఫౌండేషన్ & సేవా ట్రస్ట్, శ్రీనివాస నిలయం చారిటీస్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం మరియు గౌరవ దాత జవ్వాది కూర్మాచార్యులు ఆధ్వర్యంలో గౌరవ దాతల సహాయంతో ఒక్కొక్క బాధితునికి 10కేజీల బియ్యం, దుప్పటి చీర జాకెట్, 1000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువుల కిట్, అంటువ్యాధులు ప్రబలకుండా హోమియో మందు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ నేత జవ్వాది కూర్మచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెస్సో ట్రస్ట్ ఫౌండర్ బంగారు తాతారావు, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్ ఫౌండర్ పెంట శ్రీనివాసా చారి, శ్రీనివాసా నిలయం చారిటీస్ ఫౌండర్ కటకం శ్రీనివాసాచార్యులు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సంచాలకులు అప్పలభక్తుల శివకేశవరావు (శివ శ్రీ), విశ్వకర్మ ఫౌండేషన్ & సేవా ట్రస్ట్ ప్రతినిధి వెదురుపర్తి శ్రీ మంగేష్, ఎన్టిఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ధనాలకోట శోభన్ బాబు, బిసి సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు.















