EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విదేశీ గడ్డపై భారతదేశ సార్యభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసాడు కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటో రాహుల్ ప్రపంచానికి చాటారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పేదలు, దళితులు, గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోంది బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

హైదరాబాద్ సెప్టెంబర్ 20 (ఈతరం భారతం):అమెరికా పర్యటనలో భారతదేశం, ప్రజాస్వామ్యం పట్ల, భారత దేశప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని బిజెపి ఖండిస్తోందని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తెలిపారు.శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి , బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తో కలిసి మాట్లాడారు.విదేశీ గడ్డపై భారతదేశ సార్యభౌమాధికారాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటో అనేది అమెరికా గడ్డపై నుంచి రాహుల్ ప్రపంచానికి చెప్పారన్నారు.కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పేదలు, దళితులు, గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని,.వారిని కేవలం ఓటుబ్యాంకు గానే చూస్తున్నది తప్ప.. రాజ్యాంగపరంగా కల్పించాల్సిన హక్కుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలది.సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారని తిలిపారు.అమెరికా వేదికగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ రిజర్వేషన్లు తొలగిస్తామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.తొలి నుంచి గాంధీ కుటుంబం ఎస్సీ, ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరే అవలంభిస్తోంది.1956 నాటి కాకా కలేల్కర్ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను తిరస్కరించింది.జవహర్ లాల్ నెహ్రూ, జూన్ 27, 1961 నాటి తన లేఖలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ ఉద్దేశించి, ఏ కులానికి లేదా వర్గానికి రిజర్వేషన్లు మరియు ప్రత్యేకతలు కల్పించడాన్ని వ్యతిరేకించారన్నారు..కాంగ్రెస్ కు మొదటి నుంచీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పట్ల వ్యతిరేక భావన ఉంది.1952, 54లో కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించి చట్టసభల్లో అడుగుపెట్టకుండా కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ.1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ విలువలను తీవ్రంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ తన హయాంలో 100 కి పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. బీజేపీని ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ గురించి ప్రజలకు ఈ వాస్తవం తెలియాలి.ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో సబ్-కోటాలపై మండల్ కమిషన్ సిఫార్సులను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.గత సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి రిజర్వేషన్లను మారుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు..మార్చి 3, 1985లో రిజర్వేషన్ల ద్వారా మూర్ఖులను ప్రోత్సహించవద్ధంటూ రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదరికంతో అల్లాడిపోయింది. సుమారు 20 వేలకు పైగా గ్రామాలు కనీసం నీటి సౌకర్యానికి కూడా నోచుకోలేని పరస్థితి ఉండేది.ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ కనీస అవసరాలు కల్పించిఉంటే అలాంటి పరిస్థితులు దాపురించేవి కావు.రాజ్యాంగ పరిరక్షణకు భరోసా ఇస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top