హైదరాబాద్ సెప్టెంబర్ 22 (ఈతరం భారతం);:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ శాఖా ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా నగర్, బ్లడ్ బ్యాంక్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా శాలువ, పుష్ప గుచ్ఛం, జ్ఞాపిక తో గవర్నర్ గారిని సత్కరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా శాఖా లో ఒక బ్లడ్ బ్యాంక్ ను నిర్మించాలని తద్వారా పేద ప్రజలకు సేవ చేయవచ్చు అని తెలిపారు. ఇప్పటికే తలసేమియా, క్యాన్సర్ మరియు డయాలసిస్ పేషెంట్ లకు బ్లడ్ అందించడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే హైదరాబాద్ జిల్లా శాఖా లో నిర్మించనున్న బ్లడ్ బ్యాంక్ కు తన వంతు పూర్తి సహకారం చేస్తానని ఈ సందర్భంగా భీమ్ రెడ్డి గారికి గవర్నర్ గారు హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా, గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీరాములు ,రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీల వైస్ చైర్మన్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీల సభ్యులు డాక్టర్ బి విజయ్ భాస్కర్ గౌడ్ , రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఎంసీ సభ్యులు డాక్టర్ ఒ. శ్రీనివాస్ రెడ్డి, రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.















