విజ యవాడ సెప్టెంబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );; జలసేవా హారతి పేరుతో సృష్టికి మూల పురుషుడు సకల చరాచర సృష్టికర్త శ్రీ విశ్వకర్మ భగవానుడు జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ,బిసి మంత్రివర్యులు ఎస్ సవితల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం విజయవాడ గొల్లపూడి లో ఘనంగా జరుగుతున్న సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ఎండి తనుజారాణిను మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పెద్దలు విశ్వకర్మ భగవానుని భక్తులు పాల్గొనే విజయవంతం చేయవలసిందిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుతున్న విశ్వకర్మ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా వేణుమాధవ్ పిలుపునిచ్చారు















