15.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరం లోని SR & BGNR డిగ్రీ &PG కళాశాలలో భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా సంఘం అధ్యక్షురాలు పి ఆర్ దేవి హాజరయ్యారు . సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఎనలేని సేవ చేశారని అటువంటి గొప్ప మహిళా మూర్తి జీవిత చరిత్రను వ్యాసాలుగా రాయడానికి విద్యార్థులు ముందుకు రావాలని ఇలాంటి సామాజిక ఉద్యమకారుల జీవిత చరిత్ర రాయడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ జాకీరుల్లాహ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర , ఉపాధ్యక్షురాలు మణి, సహాయ కార్యదర్శి నాగలక్ష్మి, కళాశాల లెక్చరర్ సాంబశివరావు ,లెక్చరర్ విజయలక్ష్మి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.















