ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం ఖానాపురం హవేలీ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంల ఈరోజు స్టడీ సర్కిల్ జరుపుకోవడం జరిగింది మే డే ఏర్పడటం చికాగో నగరంలో నూలు వస్త్రాల తయారీ కంపెనీలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు పిల్లలు 24 గంటల నుండి 18 గంటల వరకు పని చేసేవారు వారికి కనీసం పసి పిల్లలకు పాలు కూడా ఇవ్వనిచ్చేవారు కాదు మహిళలకు ప్రసూతిలో కూడా సెలవులు లేకుండా పనిచేసే క్రమంలో వచ్చిన తిరుగుబాటులో మూడు లక్షల మంది చికాగో నగరంలో 1886 నుండి 1890 వరకు జరిగిన ఉద్యమాలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వారు చికాగో నగరంలో కార్మికులు రక్తపు మడుగులో వారి పోరాటంలో పోలీసుల కాల్పులలో ఎందరో కార్మికులు కొన్ని లక్షల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు వారు చిందించిన రక్తంలో వారి పోరాటాలలో ఏర్పడింది మేడే అని కార్మికులు కర్షకులు మహిళ శ్రామికులు అందరికీ విముక్తి జరిగి పని గంటలు 8 గంటలకు ఏర్పడిందని సభ్యులందరూ మాట్లాడారు ముఖ్యఅతిథిగా జర్నలిస్టు మధు శ్రీ మాట్లాడారు ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన కోసం అంటరానితనం కుల నిర్మూలన మహిళల భద్రత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ మహనీయుని బాటలో మనమంతా కొంత అయినా పనిచేయాలని సామాజిక స్పృహ కలిగి పాటుపడాలని మేడే మూడవ తేదీన కార్మిక హక్కులకు కార్యరూపం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షులు పి ఆర్ దేవి, భీమణి కే అనంతలక్ష్మి సిహెచ్ సత్యవతి కల్పన ఈశ్వరి కే లక్ష్మి రమ్య నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు















