వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేత?
06.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
విశాఖ పట్నం :పరిస్థితులు చూస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం మూతపడే దిశగా అడుగులు వేగంగా పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 2500 మంది వీఆర్ఎస్ పేర ఉద్వాసనకు రంగం సిద్ధం కాగా, 500 మంది డిప్యుటేషన్‌పై నాగర్నార్కు పంపించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఏడాది 1400 మంది రిటైర్మంట్తో స్టీల్ ప్లాంట్ ఖాళీ అయిపోనుంది. అయితే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2 లక్షల టన్నుల కోల్ నిల్వలు ఇప్పటికీ గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, విశాఖ నుంచి గెలిచిన టీడీపీ ఎంపీ భరత్ కానీ దీనిపై మాట్లాడడం లేదు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.















