తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాం..బీసీలకు చట్టసభల్లో కనీసం 27 శాతం రిజర్వేషన్లు కల్పించండి.. దాసు సురేశ్ విజ్ఞప్తి చేసారు.సానుకూలంగా ప్రధాని మోదీ స్పందించారు. శభాష్ దాసు ..బీసీల కోసం మీ పోరాటం అభినందనీయం..బీస ల అభ్యున్నతి కోసం కలిసి నడుద్దాం..అని బీసీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.బీసీల ఆత్మగౌరవ సభలో భాగంగా హైదరాబాద్ కి విచ్చేసిన భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీగారి ఆత్మీయ ఆహ్వానం మేరకు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తమ ముఖ్య నాయకులతో భారత ప్రధాని మోదీతో అంతరంగిక సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలలోని బీసీల రాజకీయ సామాజిక ఆర్థిక స్థితి గతులపై ,బీసీల నాయకత్వంపై కొనసాగుతున్న వివక్షను, బీసీలు కోల్పోతున్న అవకాశాలను బీసీల సమగ్రాభివృద్ధికై చేపట్టాల్సిన కార్యాచరణను దాసు సురేష్ ప్రధానికి వివరించారు… 75 ఏళ్లుగా దేశంలో బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని, చట్టసభల్లో ప్రాధమికంగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే బీసీల పట్ల కొనసాగుతున్న నష్టాన్ని నివారించగలమని అది ప్రధాని మోదీ తోనే సాధ్యమని తెలుపడంతో ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు.. తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని దాసు సురేశ్ తెలిపారు . బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ ( సబ్ ప్లాన్) , ప్రభుత్వ బీసీ ఉద్యోగుల క్రీమీలేయర్ ను 8 లక్షల నుండి 15 లక్షలకు పెంపు ,బీసీలకు ప్రత్యేకమైన పారిశ్రామిక విధానం ,బీసీ మంత్రిత్వ శాఖ ,బీసీల కులగణన చేపట్టడం తదితర డిమాండ్లతో కూడిన నివేదికను ప్రధానికి దాసు సురేశ్ అందించారు.. బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం బీసీ రాజ్యాధికార సమితి చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు..