శేరిలింగంపల్లి నియోజకవర్గము ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేకల విజయ లక్ష్మి అలియాస్ (వెంకటసుబ్బమ్మ) పోటి చేస్తున్నారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూజైభీమ్ భారతరత్న ,పద్మ విభూషణ్ ,విశ్వ జ్ఞాని , భారత రాజ్యాంగ నిర్మాత “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ” మనకి ఓటు అనే హక్కు కల్పించాడని, ఆ ఓటును ఉపయోగించుకొని మనం రాజ్యాధికారం కోసము పోరాడి గెలవాలని నినాదంతో తను 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేయడానికి సిద్ధం పడినట్లు తెలిపారు. ఓటుకి నోటు లేదు అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నా శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు, నాకు స్నేహితులకు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, నా గురువులకు ,నా అక్క, చెల్లెళ్లకు, అన్నలకు తమ్ముళ్లకు, శేరిలింగంపల్లిలో ఉన్న నా ప్రజానీకానికి, యువతి యువకులకు జై భీమ్ లు తెలియజేస్తూ, నేను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్ది గా నవంబర్ 8 వ తారీఖున 10am కి “నామినేషన్” వేయబోతున్నదున మీరందరూ తప్పకుండా వచ్చి నన్ను ఆశీర్వదించి, మంచి మెజార్టీతో ఈ ఎలక్షన్లలో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. మేకల సుజాత శేరిలింగంపల్లి లో గత 20 సంవస్స్త్సరాలుగా నివసిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందారు. పేదలకోసం తాను చేసిన కార్యక్రమాలు తనను గెలిపిస్తాయన్న ధీమాను సుజాత వ్యక్తం చేసారు.