EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

ఈతరం భారతం యాదాద్రి  భువనగిరి జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 6,2024 : ధూప దీప నైవేద్య అర్చక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ భువనగిరిలోని శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవాలయం నందు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాదు వాసుదేవ శర్మ పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 6,475 మంది ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కనీస వేతనము గురించి నిర్విరామంగా రాష్ట్ర సంఘము కృషి చేస్తుందని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధూపదీప నైవేద్య అర్చకుల పరిస్థితి వివరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాంగ కర్త శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి మాట్లాడుతూ రాబోయే క్రోధి నామ సంవత్సరం అందరికీ శుభం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ప్రధాన కార్యదర్శులు అన్నావజ్జుల ప్రసాద్ శర్మ, తాపాల వెంకటాద్రి స్వామి రాష్ట్ర సంఘ కన్వీనర్ హరికీర్తి అమరేశ్వర శర్మ, రాష్ట్ర సంఘ అధికార ప్రతినిధి వెగ్గలం సంతోష్ శాస్త్రి రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శులు జోషి పవన్ శర్మ పరిపూర్ణాచారి జిల్లా సంఘం అధ్యక్షులు చలివేదుల రాజేశ్వరి శర్మ ప్రధాన కార్యదర్శి చందోజు శివకుమారాచార్యులు కోశాధికారి నిమ్మల అమలేశ్వర్ జిల్లా గౌరవ అధ్యక్షులు గంగు జగదీశ్వర్ శర్మ గౌరవ సలహాదారులు హరికీర్తి వేణుగోపాల్ శర్మ మరియు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా అర్చకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top