EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శ్రీ రామకృష్ణ సేవా మందిర్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

హనుమకొండ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని శ్రీ రామకృష్ణ సేవా మందిర్ యందు శ్రీ వరసిద్ధి వినాయక హోమాన్ని పౌరోహితులు హరి లక్ష్మీనర్సింహ శర్మ & అడ్డూరి దినేశ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం హోమంలో సేవాసమితి అధ్యక్షులు శ్రీ కటంగూరి సరోజన-సత్యనారాయణ రెడ్డి, గోగుల విజయ-వీరా రెడ్డి, చింతపట్ల పద్మావతి-దేవేందర్ రావు, మూల శైలజ-తిరుపతి రెడ్డి, ఎర్రం వాణి-జనార్ధన్, కస్తూరి వనజ-శ్రీకాంత్, గట్టు మాధవి-సతీష్ దంపతులు మరియు కెఎల్ఎన్ రెడ్డి కాలనీ వాస్తవ్యులు తోకల పాపి రెడ్డి, మంద సమ్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సేవా సమితి సభ్యులు, కెవిరావు, కే.సూర్య, మూల రాధిక, సరోజనమ్మ, లక్ష్మమ్మ, అనిత, పార్వతి, లక్ష్మి రావు, వీణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర 4 గంటలకు సేవాసమితి నుండి ప్రారంభమగునని భక్తులు విశేషంగా ఈ శోభాయాత్ర లో పాల్గొనగలరని ఉత్సవ నిర్వాహకులు తెలియజేశారు

 

 

Related News

Select the Topic
Scroll to Top