జడ్చర్ల ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూ స్);బాబు జగ్జీవన్ రాం 116జయంతి ని పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని అన్నారు.అతను బాబూజీగా ప్రసిద్ధుడని, భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించి దేశానికి సేవలందించిన కొత్త నాయకుడని పేర్కొన్నారు.1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారు .1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలోబీసీసేన మండల అధ్యక్షులు నిరంజన్, సామజిక వేత్తగోనెలా రాధాకృష్ణ, బీసీసేన మండల ప్రధాన కార్యదర్శి గొడుగునర్సిములు, బీంరాజ్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు















