8.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
మరోసారి మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని ఖమ్మం భాజపా పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ఖమ్మం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన సోమవారం నాడు మధిర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎర్రుపాలెం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మురికి కాలువలు, సీసీ రోడ్లు, వీధిలైట్లు, శ్మశానవాటికలు నిర్మాణం చేసింది మోడీ ప్రభుత్వమే కానీ దాన్ని తమ ఘనతగా చెప్పుకున్నాయని అన్నారు. కేంద్రంలో మూడో సారి మోడీ ప్రభుత్వం రావాలంటే కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాట్లాడుతూ- గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేశాయనీ, దానికి భిన్నంగా నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో తమ కలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంద కృష్ణమాదిగ గారు పిలుపు మేరకు మేము తాండ్ర వినోద్ రావు గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేస్తామని వారు చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర నియోజకవర్గంలో వినోద్ రావు విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఎర్రుపాలెం మండలం కేంద్రంలో ఉపాధి హామీ కూలీలను కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ పథకాలు అందుతున్నాయో లేదో వాకబు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థిగా తనని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరగా చేరువయ్యేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ-పేద ప్రజల కొరకు నరేంద్రమోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ఎన్ ఆర్ ఈ జీ సీ పథకం కింద రైతులు పండ్ల తోటలు పెట్టుకోవడానికి, మరియు పశువుల కొట్టాలు నిర్మించుకోవడానికి ఇలాంటి అనేక రకాలైన పథకాలు రైతుల కోసం అమలుచేశారని చెప్పారు.
అనంతరం నియోజకవర్గం లోని జమలాపురం గ్రామంలో పురాతన దేవస్థానం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. రేమిడిచర్ల గ్రామస్థులు వినోద్ గారికి ఘన స్వాగతం పలికారు. ఇటీవల మరణించిన బూత్ అధ్యక్షుడు ఇత్తడి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం వారు ధైర్యం చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర చిట్టచివరి గ్రామమైన కొత్తపాలెం లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సరిహద్దు గ్రామం కాబట్టి గత ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వెలిబుచ్చారు. వారి ఇబ్బందులు సావధానంగా విన్న వినోద్ రావు మాట్లాడుతూ… తనని గెలిపిస్తే ఆ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుoచుతానని మాటిచ్చారు. అనంతరం మధిరలో జరిగిన సభలో కూడా వారు ప్రసంగించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్ రావు , ,రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నూతక్కి నర్సింహారావు , రాష్ట్ర ఎస్సి మోర్చా కార్యదర్శి పెరుమాళపల్లి విజయరాజు ,జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వర్ రావు ,జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివ ,జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వర్ రావు ,ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ కోటేశ్వర్ రావు , జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పుప్పాల చంద్రమౌళి , పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ , రూరల్ అధ్యక్షులు గుండా చంద్రశేఖర్ రెడ్డి ,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కరంగుల మురళి , బీజేవైఎం జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం , ఎర్రుపాలెం మండల దళిత మోర్చా అధ్యక్షులు గరికపాటి పురుషోత్తం ,కిసాన్ మోర్చా మండల కార్యదర్శి రావిరాల అచ్చరావు ,mrps జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ , mrps జాతీయ ప్రధాన కార్యదర్శి మాచర్ల క్రాంతి కుమార్ , mrps మధిర మండల అధ్యక్షులు కొండూరు రాజేష్ , mann ki baat జిల్లా కన్వీనర్ మారాశాకట్ల స్వర్ణకర్ ,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రాము గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు పారుపల్లి సురేష్ బాబు,ఈశ్వరయ్య, రామ్ మోహన్ , రాజేష్, అశోక్, కన్నా రామకృష్ణ, పిట్ల గోపాల్ రావు, ప్రేమ్ కుమార్, లక్కీ రెడ్డి కృష్ణా రెడ్డి , మానుకొండ కోటి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.















