15.1.2024 హైదరాబాద్, (Eetarambharatamnews ) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ మరియు గనుల సంచాలకులతో సమీక్ష నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించి వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని,వారు సమ్మె విరమించడంతో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు,దీనిపై మంత్రి మాట్లాడుతూ వచ్చే సీజన్లో కూడా ఎటువంటి కొరత లేకుండ చూడాలనీ అధికారులకు సూచించారు.మార్కెట్లలో అమ్మకాలు,కొనుగోళ్లు ముఖ్యంగా రోజు రోజుకి తగ్గుతున్న మిర్చి ధరల గురించి మరియు పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యల గురించి సమీక్షించారు.రైతులతో పంటల వైవిధ్యాలను వివరించడం ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులు అధికంగా పండించే వరి పంటను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వాని ఒక నివేదిక సమర్పించే విధముగా సరైన ప్రణాళికను సిద్దం చేయాలని మంత్రి సూచించారు.మార్కెట్లలో దళారీ వ్యవస్థ వలన పంటను తక్కువ ధరలకు అమ్ముకుని నష్టపోతున్నారు అట్టి దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకు నష్టం వాటిల్లకుండా చూడాలనీ సూచించారు. వ్యవసాయ మరియు ఉద్యోగ సంబంధిత సంఘాల ప్రతినిధులతో వారి సమస్యల పై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి వ్యవసాయ సంచాకులకు సూచించారు. ఇటీవల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో తలెత్తిన సమస్యలపై మంత్రి సమీక్షించారు….ఈ సందర్భంగా చేనేత విభాగం సంచాలకులు మాట్లాడుతూ ఉత్పత్తి చేస్తున్న పాలిస్టర్ వస్త్రాలకు ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ సౌకర్యాలు ఎక్స్పోసెర్ విజిట్స్ వంటివి ఏర్పాటు చేసి మార్కెటింగ్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు, వస్త్రాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు….గనుల శాఖ సంచాలకులతో నిర్వహించిన సమీక్షలో ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్,బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియా ను అరికట్టాలని,దోషులు ఎంతటి వారైనా వదలి పెట్టొద్దని సూచించారు.















