08.05.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో బుధవారం రోజంతా సత్తుపల్లి నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటించారు.ఎంపీ రవిచంద్ర నియోజకవర్గ కేంద్రం సత్తుపల్లిలోని జలగం నగర్, అంబేడ్కర్ నగర్,గుడిపాడు రోడ్,సిద్ధారం రోడ్డులోని సురేష్ స్కూల్ గ్రౌండ్,శ్రీనివాస టాకీస్ ఏరియాలలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు.అలాగే ఎంపీ వద్దిరాజు సత్తుపల్లి మండలంలోని రేజర్ల,సిద్ధారం,రామనగరం,కొత్తూరు, పెనుబల్లి మండలం కొత్తగూడెం రోడ్ వీ.ఏం.బంజారలలో ఎన్నికల ప్రచారం చేశారు
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూసత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి,ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేసిన మంచి నాయకుడు సండ్ర వెంకటవీరయ్య గెలవకపోవడం తీవ్ర విచారకరం. ఫలితాలు వెలువడిన 24గంటలల్లోనే తన బాధను దిగమింగి ప్రజా సేవలో తిరిగి నిమగ్నమైన గొప్ప నాయకుడు సండ్రఈ ఎన్నికల్లో స్థానికంగా ఉండి ప్రజలకు అనునిత్యం సేవలందించే,మనందరి హక్కుల సాధనకు కృషి సల్పే నాగేశ్వరరావుకు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం . ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఈ 5రోజుల పాటు కష్టించి పని చేద్దాం అని చెప్పారు
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,” వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అనే నినాదాలు మిన్నంటాయి















