7.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్) వీర నారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు. పి రమాదేవి ఈరోజు ఖమ్మం నగరంలోని పువ్వాడ ఉదయ నగర్ లో మాత రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూక్యా మణి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మహిళా సంఘం అధ్యక్షురాలు పి రమాదేవి, ఖమ్మం నగర సఖి సెంటర్ అడ్మిన్ సరిత గారు, సఖి సెంటర్ అడ్వకేట్ ఇమ్మడి అంజని, జర్నలిస్ట్ మధులత, స్థానిక నాయకులు బాబూలాల్,ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు బద్రు నాయక్ , తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు నరేంద్ర మరియు మహిళా సంఘం నాయకులు ఉపేంద్రమ్మ, అనంతలక్ష్మి, సునీత, రమ్య, నాగలక్ష్మి, ఝాన్సీ, జ్యోతి లు హాజరయ్యారు., పువ్వాడ ఉదయ నగర్ మహిళలు, గ్రామపెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షులు దేవి మాట్లాడుతూ రమాబాయి గారు దేశానికి మహిళా లోకానికి ఆదర్శవంతులు అని ఆమె సేవల ఫలితంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన సంపూర్ణంగా రాయగలిగారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులకు గురైన చలించకుండా భర్తకి సహాయ సహకారాలు అందించి ఎంతో ఉన్నత విద్యావంతుడుగా తీర్చిదిద్దిన వీర వనిత రమాబాయి అంబేద్కర్ అని ఆమె ఉద్ఘాటించారు. సఖి సెంటర్ అడ్మిన్ సరిత మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు ఎన్నో రకమైన ఒత్తిడి లకు ఆందోళనలకు గురి అవుతున్నారని అటువంటి సందర్భాలలో వారందరూ మహిళా చట్టాల పై అవగాహన పెంచుకోవాలని సూచించారు మహిళలు రానున్న రోజులలో మరిన్ని అవకాశాలనుఉపయోగించుకుని రాజకీయంగా సామాజికంగా కుటుంబ పరంగా ఎన్నో విజయ అవకాశాలను అందుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు మహిళల సాధక బాదకాలలో తోడుగా ఉండి మహిళలను మానసికంగా చైతన్య పరచాలని ఆ విధంగా వారికి తోడ్పాటు అందించాలని కోరారు. అడ్వకేట్ అంజని మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పైన, గృహహింసల పైన పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల పైన మహిళలు అవగాహన కలిగి ఉండాలని ప్రతి మహిళ తమ ఎదిగిన బాలికల అవసరాలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని సమాజంలో వారిపైన ఏ ప్రదేశంలోనైనా ఎటువంటివైనా లైంగికంగా గాని శారీరకంగా గాని అసభ్యకర సందర్భాలలో జరిగిన విషయాలపట్ల జాగ్రత్తలు తమ ఆడపిల్లలకు తెలియపరచాలని సూచించారు . ముఖ్యంగా యుక్త వయసు ఆడపిల్లల తల్లులు వారి ఆరోగ్యం, అలవాట్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. మహిళలు ఎన్నో ఏళ్లుగా వివక్షకి, చదువుకి దూరమై ఉన్నారని కానీ నేటి సమాజంలో స్త్రీలు చాలా జాగ్రత్తతో అన్ని విషయాలలో ముందంజలో ఉండేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అందుకు తగ్గట్టుగానే మహిళలు వాటిని వాడుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాబూలాల్ మహిళా సంఘానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేశారు.















