EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సమాజ హితం కోసం లక్ష్య సాధన తో ముందుకు వెళ్ళాలి   బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ సత్యనారాయణ గౌడ్

సికింద్రాబాద్ ఏప్రిల్ 2 (ఈతరం భారతం న్యూ స్) సమాజ హితం కోసం లక్ష్య సాధన తో ముందుకు వెళ్ళాలని బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఓయూ పీజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఒక లక్ష్య సాధన కోసం చేరి ఒక ఆయుధంలా తయారై సమాజానికి ఉపయోగపడతాడని పిలుపునిచ్చారు. ఆ ఘనత భారతదేశంలో ద్వితీయ స్థానంలో పేరుగాంచిన అంబేద్కర్ యూనివర్సిటీకి దక్కిందని అందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రొఫెసర్ లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ , మోహన్ , కిరణ్ , అనంతలక్ష్మి ,అనుపమ , మరియు కార్యక్రమానికి సహకరించిన తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ వేడుకల్లో ప్రథమ, ద్వితీయ విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top