ఈతరం భారతం నాగార్జునసాగర్ ప్రతినిధి ఏప్రిల్ 9 2024 : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి .మంగళవారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511 .10 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 133.5447 టీఎంసీలు ఉంది ప్రాజెక్టు నుంచి 6,498 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఇన్ ఫ్లో లేదు.















