11.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల ఈతరం భారతం
నర్సరావుపేట,ఆంధ్రప్రదేశ్ : సాధారణ ఎన్నికల దృష్ట్యా నరసరావు పేట మార్కెట్ యార్డ్ లోని EVM స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటులను జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్ IPS పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిబ్బంది 24X7 అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు స్ట్రాంగ్ రూంలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత మరియు బందోబస్త్ ఏర్పాటు చేశామని, ఎన్నికలు పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిబంధలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరు గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట నరసారావు పేట 1టౌన్ ,2టౌన్ సిఐలు, ఎస్సైలు మరియు ఇతర అధికారులు ఉన్నారు..















