EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సామాజిక దార్శనికుడు జ్యోతిబా ఫూలే లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు

సిద్దిపేట ఏప్రిల్ 11 (ఈతరం భారతం న్యూ స్);ప్రపంచ గతిని మార్చే శక్తి ఒక్క విద్య వల్లనే సాధ్యమని నమ్మి ఆ కాలంలో వున్న సామాజిక,కుల, లింగ వివక్షతలనుపారద్రోలడానికి అహర్నిశలు పోరాడిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. ఈ రోజు 198 వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద గల ఫూలే విగ్రహ మూర్తికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా అన్నారు. ముఖ్యంగా మహిళలకు చదువును అందించడం కోసం, అసమానతలు తొలగించడం కోసం, రైతుల బాగు కోసం ఎన్నో అవమానాలను సహించి పేరుకు పోయిన పెత్తందారీ వ్యవస్థలపై అహర్నిశలు పాటు పడ్డారని ఆ త్యాగమూర్తి దార్శనికత వల్లనే ఈ నాడు ఫలితాలు అనుభవిస్తున్నమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాజీపేట సత్యనారాయణ, బాల్ నర్సయ్య, రాజేంద్రప్రసాద్ భట్, శ్రీరామ్ సురేషు, బాలమల్లు, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నా

రు.

 

Related News

Select the Topic
Scroll to Top