EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సామాజిక సమానత్వం కై పోరాడిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ : లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు

సిద్దిపేట ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూస్ );భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 116వ జయంతి సందర్బంగా సిద్దిపేట లోని బి.జే. ఆర్ చౌరస్తా వద్ద గల బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని కొనియాడారు. అనేక పదవులను చేపట్టి దేశంలో తనదైన శైలిలో విలక్షణ జాతీయ నాయకునిగా ఎదిగారని ఆయన వెల్లడించారు. ఆయన జీవిత పర్యంతం బడుగు బలహీన వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని రేపటి పౌరులు ప్రతీ ఒక్కరూ అయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అయన ఆశయ సాధనకు కృషి చేయాలనీ తుమ్మనపల్లి పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జే.ఏ.సి నాయకులు భూపతి రెడ్డి, సామాజిక సమరసతా వేదిక నాయకులు ఏర్రమరాజు రాజేంద్ర ప్రసాద్ బట్, బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కాజీపేట సత్య నారాయణ, బాల్ నర్సయ్య, శ్రీనివాస్ , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top