EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సింగరేణి కార్మికులు కాంగ్రెస్ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ సంఘటిత అసంఘటిత కార్మిక విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో జిడికె 2ఎ ఇంక్లైన్ ఓవర్ మైన్ కిరణ్ తో పాటు 100మంది సింగరేణి కార్మికులు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ గనులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఓపెన్ కాస్ట్ లు చేసి ఉద్యోగులను తగ్గిస్తున్నరాని అన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చుస్తుందాని, ఎంతటి పోరాటం చేయడానికైన వెనకడుగు వెసెది లేదు ప్రైవేట్ పరం కనివ్వం అని అన్నారు..ఒక్క సారి అలోచన చేయండి.. ఈ ప్రాంతంలో ఎలా దోపిడి జరుగుతుందో అలోచన చేయాలని అన్నారు.. ప్రజా హితం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.. దేశనికి వెలుగులు ఇచ్చిన సింగరేణి కార్మికులకు ఇన్ కాం ట్యాక్ తో పాటు ఇతర ట్యాక్ ను మినహయింపు చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పారని, సైనికుడికి ఇచ్చే గౌరవం ఇవ్వాలని అన్నారు. యువ మిత్రులందరు ఉద్యమించాలి, దోపిడి పాలనను ప్రశ్నించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక బంధువులకు అండగా ఉటుందాని, ఒక్క అవకాశం చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు..నన్ను గెలిపించాలని నాతో కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పోరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్మికులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top