సికింద్రాబాద్ నవంబర్ 16 (ఈతరం ఇండియా న్యూ స్);సికింద్రాబాద్ లో తమ పార్టీ విజయం ఖాయమని, హ్యాట్రిక్ సాధించానున్నామని, కాలనీలు, బస్తీలనే తేడాలు లేకుండా అన్ని ప్రాంతాలను సరిసమానంగా అభివృద్ధి చేశామని బౌద్ధ నగర్ డివిజన్లో బహు గొప్ప స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ.ఆర్.ఎస్. అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ పరిధిలో ని వివిధ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజ తో కలిసి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేశామని, సికింద్రాబాద్ ను అభివృద్దిలో నడుపుతున్నామని పద్మరావు గౌడ్ అన్నారు. 10 సంవత్సరాల కాలంలో తాము చేపట్టని పనులు లేవని, అన్ని మౌలిక వసతుల పై దృష్టి పెట్టమని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యతను కల్పిస్తూనే సంక్షేమ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ ను అగ్ర భాగంలో నిలిపినట్లు పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నాయకులు బల్ల గీత, సుమతి తదితరులు పాల్గొన్నారు. లలితానగర్, బ్యాంక్ కాలనీ, అంబర్ నగర్, బౌద్ధనగర్, రాఘవేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పాదయాత్ర సాగింది. అన్ని ప్రాంతాల్లో స్థానికులు పద్మారావు గౌడ్ కు స్వాగతం పలికారు.

















