హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ఈ బీ న్యూ స్);నిరంకుశ నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల గొంతు గొంతు నొక్కుతుందని సిపిఐ ( ఏం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్రకమిటీ నేడొక ప్రకటనలో తీవ్రంగా విమర్శింది.న్యాయమైన రైతాంగ హక్కులకై పోరాడుతున్న రైతులపై మిలిటరీ, బాస్ప వాయువులను ప్రయోగించడందుర్మార్గం చర్య అని,ఢిల్లీ సరిహద్దులో రైతులు న్యాయపరమైన డిమాండ్స్ ల కోసం పోరాడుతున్నారని,వారిపై మిలిటిరిని పెట్టి వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం యావత్తు దేశంకదిలిందని,మోడీ ప్రభుత్వం రైతులతో తక్షణమే రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.రైతులు చెలో ఢిల్లీ పిలుపు పై 15 రోజుల క్రితమే మోడీకి లేఖ రాసినా,ఇప్పటి వరకు రైతులకు మోడీ ప్రభుత్వం నుండి ఎలాంటి బరోసా రాలేదుహరిత విప్లవ సృష్టి కర్త ఏం ఎస్ స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది,వ్యవసాయంలో ఆయన చేసిన ప్రతిపాదనలను అమలు చెయధా ? అని ప్రశ్నించింది.ఈ నెల 16 న జరిగే గ్రామీణ బంద్లోపేదలు,కూలీలు,కార్మికులు,కర్షకులు బారి ఎత్తున పాల్గొని జ్యప్రదం చేసి,కేంద్రానికి గుణపాఠం చెప్పాలని పిలిపు నిచ్చింది
.















