EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సీఎం రేవంత్ రెడ్డి తో బీసీ సంఘాల భేటీ అభినందనలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని సీఎంను కోరిన జాజుల సానుకూలంగా స్పందించిన సీఎం

 

హైదరాబాద్ డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డిని బుదవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని వివిధ బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు రాష్ట్ర అసెంబ్లీలో కలిసి అబినంధలు తెలిపారు, రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘాల ప్రతినిధుల బృందం శాలువాతో కప్పి, పూల బొక్కెలు అందించి సత్కరించారు,తదుపరి జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమగ్ర కులగణను నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతం కు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలైన గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకుపోయారు, అలాగే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజుల రియంబర్స్మెంటు అమలు చేయాలని ఆయన కోరారు. ?బీసీ కులగణను నిర్వహిస్తామని కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సదస్సులో తాము ప్రకటించామని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం కులగణను నిర్వహించి, బీసీ కులాల లెక్కలు తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, కోర్టులో న్యాయపరమైనటువంటి అంశాలు ఉంన్నదున ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి గ్రామపంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు, సీఎంతొ పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.? సిఎం కలిసిన బీసీ ప్రతినిధుల బృందంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, సగర సంఘం అధ్యక్షుడు ఉప్పర శేఖర్ సాగర,బీసీ మహిళ సంఘం అధ్యక్షురాలు బి.మనిమంజరి,బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,బీసీ నేతలు రావులకొల్ నరేష్ ప్రజాపతి, గోడుగు మహేశ్ యాదవ్, నరసింహ నాయక్, సమతా యాదవ్, స్వర్ణ గౌడ్, తారకేశ్వరి,పానుగంటి విజయ్ ,సత్యం సగర తదితరులు పాల్గొన్నారు..

Related News

Select the Topic
Scroll to Top