15.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
సీసీ రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష .తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన ఎలక వెంకటేశ్వర్లు ఇంటి ముందు ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును రాత్రి 11 గంటల సమయంలో పది మీటర్ల మేర రోడ్డును ధ్వంసం చేసినందుకు గ్రామస్తులు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
దౌర్జన్యంగా ఎలక వెంకటేశ్వర్లు సీసీ రోడ్డును ధ్వంసం చేయడంపై గ్రామస్తులు 2017లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ సీటు కోర్టులో ప్రవేశపెట్టగా సుదీర్ఘ కాలం పాటు విచారించిన కోర్టు సదరు వ్యక్తిపై సాక్షదారాలు రుజువైనందున ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపిక నాగ శ్రావ్య సోమవారం రెండు సంవత్సరాలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు.















