EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సుంతుష్టీకరణ నినాదాల మీద పరిపాలన సాగించిన కాంగ్రెస్    ఒక వర్గం కోసమే ఆ పార్టీ ఉన్నట్లుగా ఆపార్టీ వ్యవహరిస్తోంది ఆర్టికల్ 370 అధికరణం రద్దును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది             I.N.D.I.A అవినీతి నాయకుల కూటమి                    మహిళలంటే కాంగ్రెస్ కు వివక్ష బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

హైదరాబాద్ ఏప్రిల్ 8 (ఈతరం భారతం న్యూ స్):స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సుంతుష్టీకరణ విధానాల యొక్క నినాదాల మీద పరిపాలన కొనసాగిస్తూ, ఒక వర్గం కోసమే ఆ పార్టీ ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవుదూడ గుర్తును వదులుకుని చేతి గుర్తును ఎంచుకోవడమే లౌకికవాదం, సంతుష్టీకరణకు నిదర్శనమని దుయ్యబట్టారు. భారతదేశంలో కశ్మీర్ ను అంతర్భాగం చేసే ఆర్టికల్ 370 అధికరణం రద్దును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సమ్మతించిన యూనిఫామ్ సివిల్ కోడ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో పాకిస్తాన్ చెప్పిన మాటలనే రాహుల్ గాంధీ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మతపీడనకు గురై భారత్ కు తరలివచ్చిన శరణార్థుల కోసం తీసుకొచ్చిన సీఏఏను కాంగ్రెస్ సమర్థించకపోవడానికి మైనారిటీ సంతుష్టీకరణ కోసమేనంటూ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామమందిరం నిర్మిస్తే.. ప్రాణప్రతిష్ట నాడు నరేంద్ర మోదీ గారు వెళ్తున్నారనే కారణంతో ఆలయాన్ని సందర్శించలేదనుకుంటే.. మరి ఆ తర్వాత ఈనాటి వరకు రాహుల్ గాంధీ రామ్ లల్లాను ఎందుకు దర్శించలేదంటూ ప్రశ్నించారు. ఇదంతా ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసమేనని దుయ్యబట్టారు. ముస్లింలీగ్ తో పొత్తు పెట్టుకుంది కూడా మైనారిటీ సంతుష్టీకరణ కోసమేనని నిప్పులు చెరిగారు. ఇవాళ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.

I.N.D.I.A అవినీతి నాయకుల కూటమి :

 

 

విపక్ష పార్టీల ‘I.N.D.I.A కూటమి విషయంలో కాంగ్రెస్ ను తూర్పారబట్టారు. అసలు UPA ఉండగా I.N.D.I.A ఎందుకంటూ ప్రశ్నించారు. I.N.D.I.A కూటమిని ప్రారంభించిన నితీష్ కుమార్ లాంటి నాయకులే వైదొలగారని, మరోవైపు మమతా లాంటి వారి అంటీముట్టనట్లుగానే ఉన్నారని అన్నారు. అలాంటప్పుడు I.N.D.I.A ఇంకెందుకంటూ చురకలు అంటించారు. విపక్ష పార్టీల కూటమిలో ఉన్నవాళ్లంతా అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొన్నవాళ్లేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా దేశభక్తి ఉన్నట్లయితే, సర్వధర్మం కోసమే అయినట్లయితే I.N.D.I.A కాదు.. భారత కూటమి అని పెట్టుకునేవారని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ….. ఇటీవలే ఎన్నికల ప్రచారం ప్రారంభమైందని, ప్రశాంత్ కిషోరే భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు వస్తాయని ఒప్పుకున్నాడని, బీజేపీ దే అధికారమని చెప్పారని…. మరికొన్ని రోజులైతే బీజేపీ కి 370కి పైగా సీట్లు వస్తాయని, 400 సీట్లతో ఎన్డీయే విజయం సాధిస్తుందని ఆయనే ఒప్పుకుంటారంటూ చురకలు అంటించారు.

మహిళలంటే కాంగ్రెస్ కు వివక్ష :

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో రోహింగ్యాల గురించి ప్రస్తావనే లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి వస్తున్న అక్రమ చొరబాటుదారులను తరమేస్తామని ఎందుకు చెప్పలేకపోయారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బస్సులతో పాటు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, కాలేజీ బస్సుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల మహిళలు ఎంతో మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారని, ఉచిత ప్రయాణానికి ఆధార్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల వారు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు ఆ నిష్పత్తికి అనుగుణంగా బస్సుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష వహిస్తోందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఓడించడం ఖాయమన్నారు.

గ్యారంటీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు.మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెబుతున్న కాంగ్రెస్… మహిళల పట్ల ఎందుకు వివక్ష వహిస్తోందని ప్రశ్నించారు.మహిళలకు మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం లేదు.. నగరంలో తిరుగుతున్న స్కూళ్లు, కాలేజీ బస్సుల్లో అమ్మాయిలకు ఉచిత ప్రయాణం లేదు.. ఐటీ రంగానికి చెందిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. అలాంటప్పుడు మహిళలందరికీ ఉచిత ప్రయాణమని ఎలా చెప్పుకుంటారన్నారు.మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కాంగ్రెస్.. ఆ పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలని ప్రబాకర్ డిమాండ్ చేసారు.మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. మెట్రో రైళ్లలో, ఎంఎంటీఎస్ ట్రైన్లు, కాలేజీలకు సంబంధించిన బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఉచిత ప్రయాణం కల్పించాలని,హైదరాబాద్ నగరం కాస్మోపాలిటిన్ సిటీ అయిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలకు హైదరాబాద్ నగరానికి వస్తుంటారు.టీవీల్లో యాడ్స్, పేపర్లలో ప్రకటనలతో మహిళలకు ఉచిత ప్రయాణమని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది.మహిళలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా పథకాన్ని అమలు చేస్తుండటంతో నష్టపోతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు, ఆ నిష్పత్తికి అనుగుణంగా బస్సుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు..? ఇదేనా మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ నీతి, న్యాయం అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకం ప్రజలకు అర్థమైపోయింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఖతం పట్టించడం ఖాయమన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల కేసుల్లో విచారణపై విమర్శలు తగవు. అవి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విచారణలు.మద్యం కుంభకోణం కేసులో కవిత చాలాసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తుసంస్థలు రాజ్యాంగబద్ధమైనవి. అంతేకాని, కాంగ్రెస్, బీజేపీ జేబుసంస్థలు కాదన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top