హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు.ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఓవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచనా దినోత్సవంగా నిర్వహించడం లేదన్నారు.గతంలో బీఆర్ఎస్ కూడా ఒవైసీలకు భయపడే నిర్వహించలేదు.బీఆర్ఎస్ సర్కార్ లో వున్నప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించారు.ఇప్పడు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అంటోంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తూన్నాయి.ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూ అవకాశం ఉంది, రాజకార్ల అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గౌరవించి, ప్రజా పాలన దినోత్సవం పేరు కాకుండా… తెలంగాణ విమోచన దినోత్సవం గా నిర్వహించాలని డిమాండ్ చేసారు.లేకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదు.ఈ సారి కూడా రాష్ట్రంలో తెలంగాణ విమోచనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం.తెలంగాణ నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక లో కలిసిన జిల్లాలోనూ …. విమోచనా దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారు.తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏంఐఏం కూ భయపడి, సెప్టెంబర్ 17ను విమోచనా దినోత్సవంగా జరపడం లేదన్నారు
.















