EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సెయింట్ జోసెఫ్ కొ కేథడ్రల్ చర్చి గుట్టల బజారు నందు మూడు రోజుల ప్రార్థనా కూటములు

6.2.2024 ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)ఖమ్మం నగరం లో..సెయింట్ జోసెఫ్ కొ కేథడ్రల్ చర్చి గుట్టల బజారు నందు ఏర్పాటుచేసిన మూడు రోజుల ప్రార్థనా కూటములలో భాగముగా ఖమ్మం జిల్లాలోని ఆర్సియం చర్చల నుంచి అనేకమంది భక్తులు ప్రార్ధన కుటమిలో పాల్గొని దేవుని ఏసు ప్రభును ఆరాధించారు..ఈ కార్యక్రమంలో నిర్వహించిన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ శ్రీ లాజరు, మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేవుని ఆరాధించుటకై మరియు ఈ ప్రార్థనలో పాల్గొని ఎంతోమంది భక్తులు స్వస్థతలు మరియు కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తీరాలని ఈ ప్రార్థన కూటములు ఏర్పాటు చేయడమైనది..తన ప్రసంగంలో ఏసుప్రభువు ప్రజలందరినీ ప్రేమ సేవా మార్గంలో నడిపి ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు యేసుప్రభు బోధనలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు ఇంకా ఈ ప్రార్థన కూటమి రేపు అనగా ఏడవ తారీఖు బుధవారం రోజు కూడా నిర్వహించబడుతుందని ఈ అవకాశాన్ని భక్తులు అందరూ కూడా సద్వినియోగ పరుచుకోవాలని కోరారు..ఈ ప్రార్ధన కూటమిలో భాగంగా ప్రసంగికులు..దానవాయిగూడెం విచారణ గురువులు,, రెవరెండ్ ఫాదర్ శ్రీ కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి భక్తులందరికీ ప్రవచనాలు చేసారు..యేసుప్రభు యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కురవాలని ప్రజలందరిని ఉద్దేశించి ప్రార్థించడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా..ఈ దివ్యబలి పూజను రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ అర్పించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సిస్టర్స్ బ్రదర్స్ ఉపదేశి కమిటీ సభ్యులు మరియు సంఘస్తులు అందరూ పాల్గొన్నారు..

Related News

Select the Topic
Scroll to Top