ది. 08.02.2024 ఖమ్మం బ్యూరో:(ఈ బీ న్యూస్)త్వరలో ప్రారంభం కానున్నస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రం పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా వుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల కు శిక్షణ నిచ్చేందుకు సిద్ధంగా వున్న సిటీ శిక్షణ కేంద్రాన్ని గురువారం పోలీస్ కమిషనర్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..స్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ సివిల్ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ కోసం రానున్నారని తెలిపారు. పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ నిచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు శిక్షణ తరగతుల నిర్వహణకు అధికారులు కసరత్తు పూర్తి చేసిన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ఖమ్మం పోలీస్ శిక్షణా కేంద్రాలో 250 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. శిక్షణా కేంద్రంలోని కంప్యూటర్ లాబ్ , గ్రంధాలయం, బ్యారెక్స్, బోజనశాల, మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గదులు, తరగతి గదులు, విధ్యుత్ సరఫరా, అవుట్ డోర్, ఇండోర్ తరగతుల నిర్వహణ, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో AR ఏసీపీ నర్సయ్య, పోలీస్ హౌసింగ్ బోర్డు DE రామదాసు, AE రామ్ చందర్, RI కామరాజు, తిరుపతి, CI సర్వయ్య పాల్గొన్నారు.















