21.1.2024ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(eetaram bharatam news)
ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రిని సాదరంగా ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ప్రత్యేక పూజల్లో మంత్రి పొంగులేటి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.















