EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు వారి కలలను సాకారం చేస్తా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్

సంగారెడ్డి ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూ స్);సంగారెడ్డి జిల్లా, సదాశిపేట పట్టణ స్థానిక కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన సమావేశంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ ల లోని 14 నియోజకవర్గాలలో ప్రజలకు ధైర్యాన్ని నింపిన, భరోసా చెప్పిన చెరుకు రైతు గుర్తు ఈరోజు మళ్లీ జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి , రైతులకు భరోసా ఇవ్వడానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు వారి కలలను సాకారం చేయడానికి జహీరాబాద్ ,మెదక్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా చెరుకు రైతు గుర్తుతో బరిలో ఉన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పటిష్టమైన నిర్ణయాలతో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తానని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో శ్రీ నూతన గౌడ సంఘం యూత్ ప్రెసిడెంట్ ఎర్ర విగ్నేశ్వర్ గౌడ్, ప్రముఖ నాయకుడు లక్ష్మణ్, బీసీ సంఘం నాయకులు గోపాల్ నేత, ప్రశాంత్,కోవూరి శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ మజార్ మరియు యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top