EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హరీష్ రావు బాగా కష్టపడతారు కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదు. హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు

నల్గొండ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్);: మాజీమంత్రి హరీష్ రావు‌ పై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. హరీష్‌ రావును కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో బాగా కష్టపడతారని కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని చెప్పారు. హరీష్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్‌లోకి 26 మందిని తీసుకువస్తే హరీష్‌కు దేవాదాయ శాఖ ఇస్తామని అన్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే చేసిన పాపాలు కడుక్కోవచ్చని అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ…బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి లాగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ను చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.తాము పదవుల కోసం కాదని.. ప్రజల కోసం ఉండేవాళ్లమని తెలిపారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలని సవాల్ విసిరారు. నల్గొండ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. ఆ సభకు ప్రజలు రారని.. కార్యకర్తలు మాత్రమే వస్తారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఇంటి బాట పట్టించినందుకే కేసీఆర్ పోరుబాట పట్టారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను పజలు అసహ్యించు కుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top