హలో బిసి చలో ఎంజీఎం..
ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 2.9.24
గత తొమ్మిది రోజులుగా చాపతి కుమార్ గాడ్గె చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం హనంకొండ నుండి ఎంజీఎం వరకు భారీ ఎత్తున బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు పాదయాత్రగా వెళ్లి చాపతి కుమార్ గాడికే గారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలిండియా ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేస్తూ కులగలను చేపడతామని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటాను కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని గెలిచిన ఆరు నెలల్లోనే అమలు చేస్తానని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ కార్యాచరణ చేయకపోవడం నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి చాపరతి కుమార్ గాడికే గారికి సిద్ధన్నకు సంజయ్ కి మద్దతుగా ఈ పాదయాత్ర చేసి వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కామారెడ్డి డిక్లరేషన్ ని అమలుపరచాలని లేని పక్షాన బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హెచ్చరించడం జరిగింది.















